Advertisement

కంగువ యూనిట్ కు బిగ్ షాక్

Wed 30th Oct 2024 11:33 AM
kanguva  కంగువ యూనిట్ కు బిగ్ షాక్
A Big Shock for Kanguva team before Release కంగువ యూనిట్ కు బిగ్ షాక్
Advertisement

సూర్య-శివ కాంబోలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కంగువ విడుదలకు సిద్ధమైంది. సూర్య అలాగే టీమ్ కంగువ ను తెగ ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు నుంచి నార్త్ వరకు కంగువ పై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్న టీమ్ కి ఇప్పుడొక బిగ్ షాక్ తగిలింది. కంగువ కు  ఎడిటర్‌గా పనిచేసిన నిషద్ యూసఫ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం సినిమా ఇండస్ట్రీలోనే కాదు కంగువ టీమ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. 

నిషద్ మరణ వార్త మలయాళ ఇండస్ట్రీలో కలకలం రేపింది. ప్రస్తుతం నిషాద్ మరణంపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిషాద్ యూసఫ్‌ కు 43 సంవత్సరాలు. అక్టోబర్ 30వ తేదీన తెల్లవారు జామున కోచికి సమీపంలోని పనమ్‌పిల్లి నగర్‌లోని తన ఫ్లాట్‌లో విగత జీవిగా కనిపించారు. ఆయనకు భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. 

అతి చిన్న వయసులో అసువులు బాసిన నిషద్ మరణ వార్త వినగానే కేరళ పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించి, సాక్ష్యాలు సేకరించారు. ఆయన మరణం వెనుక ఏదైనా అనుమానాస్పద పరిస్థితులు చోటు చేసుకొన్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

నిషాద్ పనిచేసిన మమ్ముట్టి చిత్రం బాసూక్క, సూర్యతో కంగువా, నిస్లాలాన్ అలపుజా జింఖానా, తరుణ్ మారుతి, మోహన్ లాల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉన్నాయి. 

A Big Shock for Kanguva team before Release:

Kanguva film editor Nishad Yusuf found dead

Tags:   KANGUVA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement