నాగ చైతన్య అప్పట్లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్దమైనప్పుడు నాగార్జున సమంత ను తన కుమార్తెగా ట్రీట్ చేసారు. గోవాలో సమంత-నాగ చైతన్య వివాహానికి నాగార్జున ఎంత సందడి చేసారో అనేది ప్రతి ఫ్రెమ్ లోను చూసాము. ఆతర్వాత కూడా నాగార్జున ఓపెన్ గానే సమంత ని ఎంతో ప్రేమగా ట్రీట్ చేసేవారు.
చైతు-సమంత విడాకుల విషయంలోనూ నాగార్జున చాలా సఫర్ అయ్యారు. అటు చైతూని ఓదార్చాలో, ఇటు సమంతను వదులుకోవాలో అనే విషయంలో నాగ్ సతమతమయ్యారు. ఇక అది ముగిసిపోయిన గతం. ఇప్పుడు నాగర్జున తన కొడుకు లైఫ్ లోకి రాబోతున్న శోభిత విషయంలోనూ అంతే ప్రేమగా కనిపించడం మాత్రం అక్కినేని అభిమానులను సర్ ప్రైజ్ చేసింది.
పెళ్లి కాకుండానే తన ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైన ఈవెంట్ ANR అవార్డ్స్ ఫంక్షన్ లో నాగార్జున తనకు కాబోయే కోడలు శోభిత దూళిపాళ్లను ప్రత్యేకంగా మెగాస్టార్ లాంటి అతిధులకు పరిచయం చెయ్యడం అభిమానులను చాలా అంటే చాలా ఇంప్రెస్స్ చేసింది. నాగార్జున అప్పట్లో సమంతపై ఎంత ప్రేమ చూపించారో, ఇప్పుడు శోభితపై కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు అంటూ మాట్లాడుకుంటున్నారు.