భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులిచ్చి కుర్ర హీరో అర్జున్ కపూర్ తో కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న మలైకా అరోరా.. ఈమధ్యన తన తండ్రిని పోగొట్టుకుంది. మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇకపోతే కొన్నేళ్లుగా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న మలైకా ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసి జంటగా దర్శనమిచ్చేవారు.
కానీ కొన్నాళ్లుగా అర్జున్ కపూర్, మలైకా కపూర్ లు కలిసి కనిపించకపోవడంతో వారికి బ్రేకప్ అయ్యింది అనుకుంటున్నారు. బాలీవుడ్ ఈవెంట్స్ కు, ఫంక్షన్స్ కు మొహమాటం లేకుండా జంటగా హాజరయ్యే మలైకా-అర్జున్ కపూర్ ఈమధ్యన కలిసి కనిపించిన క్షణాలు లేవు. దానితో మలైకా-అర్జున్ కపూర్ విడిపోయారంటూ ప్రచారం జరిగింది.
ఈమద్యలో మలైకా కపూర్ తండ్రి మరణించిన సందర్భంలో అర్జున్ కపూర్ మలైకా వెంటే ఉన్నాడు. దానితో బ్రేకప్ రూమర్స్ అనుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ మలైకా తో బ్రేకప్ రూమర్స్ కాదు నిజమే అని చెప్పకనే చెప్పేసాడు. రీసెంట్ గా అర్జున్ కపూర్ ఓ దివాళి పార్టీకి హాజరయ్యాడు.
అక్కడ అర్జున్ కపూర్ మైక్ తీసుకోగానే అందరూ మలైకా అంటూ అరుస్తుండగా.. అర్జున్ వాళ్ళను ఆపుతూ నేను ప్రస్తుతం సింగిల్, మీరంతా రిలాక్స్ అవ్వొచ్చంటూ మలైకా తో బ్రేకప్ రూమర్స్ ని నిజమని చెప్పేసాడు.