గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఇంకా సినిమా విడుదలకు 75 డేస్ ఉంది.. ఇకపై గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ షురూ అంటూ మేకర్స్ హంగామా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. గేమ్ ఛేంజర్ టీజర్ తోనే అందుకు సంబందించిన ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం RC 16 మూవీ మేకోవర్ లో బిజీగా వున్నారు. రామ్ చరణ్ రాక కోసం దర్శకుడు బుచ్చిబాబు వెయిటింగ్. రామ్ చరణ్ ఆల్మోస్ట్ RC 16 మేకోవర్ లోకి మారిపోయారు. ఫుల్ రగడ్ లుక్ లోకి మారిపోయి కాస్త వెయిట్ పెరిగారు రామ్ చరణ్. తాజాగా రామ్ చరణ్ ANR అవార్డు వేడుకలో కనిపించారు.
అదే రామ్ చరణ్ లుక్ ని బుచ్చిబాబు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫైర్ గుర్తు పెట్టగానే మెగా ఫ్యాన్స్ అలెర్ట్ అయ్యారు. RC 16 లో చరణ్ లుక్ ని బుచ్చిబాబు రివీల్ చేసేసాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. మరి బుచ్చిబాబు చరణ్ ని ఎలా చూపించబోతున్నాడు అనే విషయంలో మెగా ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ అయితే వచ్చేసినట్లే కనిపిస్తుంది.