కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలిలో వచ్చిన విభేదాలతోనే తన భార్య జ్యోతిక పిల్లలతో కలిసి చెన్నై నుంచి తండ్రి, తమ్ముడు కి దూరంగా ముంబై షిఫ్ట్ అయ్యాడు, జ్యోతిక యాక్టింగ్ కెరీర్ నచ్చని సూర్య తండ్రి ఆమెకి అడ్డు చెప్పడంతోనే సూర్య భార్య జ్యోతిక తో సహా ముంబైలోనే ఉంటున్నాడంటూ రకరకాల వార్తలు మీడియాలో వినిపించాయి.
ఈ విషయమై కార్తీ చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికి అటు సూర్య కానీ ఇటు జ్యోతిక కానీ ఈ విషయమై స్పందించలేదు. తాజాగా సూర్య కంగువ ప్రమోషన్స్ లో భాగంగా తాను చెన్నై నుంచి అసలు ముంబైకి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందో చెప్పి షాకిచ్చాడు. జ్యోతిక తనని పెళ్లి చేసుకుని చాలా త్యాగం చేసింది.
తనకి 18 ఇయర్స్ ఏజ్ లోనే ముంబై నుంచి చెన్నైకి వచ్చేసింది. ఒకొనొక దశలో సినిమా ఛాన్సులు వచ్చినా నా కోసం, పిల్లల కోసం వదులుకుంది. ముంబైలోనే పుట్టి పెరిగిన జ్యోతిక అక్కడి ఫ్రెండ్స్ ని బాగా మిస్ అవుతుంది. కరోనా పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ జరిగిపోయాయి. ఆ తర్వాతే ముంబై కి షిఫ్ట్ అయ్యాము.
ఇప్పుడు జ్యోతికకు సినిమా అవకాశాలొస్తున్నాయి. వెబ్ సీరీస్, సినిమాలు ఇలా తాను బిజీ అయ్యింది. ముంబై షిఫ్ట్ అయ్యాక జ్యోతిక తన ఫ్రెండ్స్ ని కలుస్తుంది. నేను రెగ్యులర్ గా ముంబై వెళుతుంటాను, నా ఫ్యామిలీ కోసం నేను నెలలో పది రోజులు కేటాయిస్తాను అంటూ సూర్య ముంబై షిఫ్ట్ అవడంపై క్లారిటీ ఇచ్చాడు.