సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి మూవీ వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో మొదలవుతుంది అని మహేష్ అభిమానులు ఆతృతను తగ్గించుకుంటున్నారు. లేదంటే దసరా కి SSMB 29 ఓపెనింగ్ ఉంటుంది అని ఆత్రుత పడిన వారికి రాజమౌళి ఇప్పటివరకు చిన్న క్లూ కూడా ఇవ్వకపోవడంతో చాలా డిజపాయింట్ అయ్యారు.
ఇక రాజమౌళి తో మహేష్ మూవీని మిగతా హీరోల్లా హడావిడిగా సెట్స్ మీదకి తీసుకెళ్ళలేం, మహేష్ కాబట్టే స్క్రిప్ట్ రెడీ చెయ్యడానికి రెండేళ్లు పట్టింది అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ గారు SSMB 29 పై విపరీతమైన హైప్ పెంచారు. అయితే మహేష్ తో చెయ్యబోయే మూవీ కోసం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండడం కాదు...
ఆయన లొకేషన్స్ వేటలో నిమగ్నమయ్యారు. సౌత్ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుండడంతో.. దానికి సంబందించిన లొకేషన్స్ కోసం రాజమౌళి ఆఫ్రికా, కెన్యా వెళ్లారు. అక్కడ అడవులు, ఎడారులలో కలయ తిరుగుతూ లొకేషన్స్ ను చూసుకుంటున్న పిక్స్ వైరల్ గా మారాయి.
ఈ పిక్స్ చూసిన వారంతా అయ్యో మహేష్ మూవీ కోసం రాజమౌళి ఇలా అడవులు, ఎడారుల పాలయ్యారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.