బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు తెర వెనుక గబగబా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ మూవీ ఎనౌన్సమెంట్ వచ్చేసింది. ఆ సినిమా లాంచింగ్ డేట్, రెగ్యులర్ షూట్ కోసం అభిమానులు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు.
ఈలోపులో మోక్షజ్ఞ సరసన నటించే హీరోయిన్ విషయంలోనే కాదు.. ఆయనతో విలన్ గా పోటీపడే హీరో గురించిన కబుర్లు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వాడుకలోకి వచ్చేసాయి. బాలీవుడ్ శ్రీదేవి చిన్న కుమర్తె ఖుషి కపూర్ అయితే మోక్షు సరసన హీరోయిన్ గా బావుంటుంది అని, కాదు ఆ బాలీవుడ్ హీరోయినయితే బావుంటుంది అంటూ రకరకాల ప్రచారాలు.
ఈ నేపథ్యంలోనే బాహుబలి విలన్ రానా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ విలన్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో కనిపించింది. మరి బాహబలిలోనే కాదు హీరోగా ను పాపులర్ అయిన రానా మోక్షజ్ఞ కు విలన్ గా కనిపిస్తే థియేటర్స్ లో పూనకాలే అంటూ నందమూరి అభిమానులు అప్పుడే హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోతున్నారు. చూద్దాం మోక్షజ్ఞ కోసం ఏ స్టార్ క్యాస్ట్ ని ప్రశాంత్ వర్మ తీసుకొస్తాడో అనేది.!