Advertisementt

వేణు స్వామీ.. ఈసారి తప్పించుకోలేవు

Mon 28th Oct 2024 06:10 PM
venu swamy  వేణు స్వామీ.. ఈసారి తప్పించుకోలేవు
High Court Clears Path for Action Against Venu Swamy వేణు స్వామీ.. ఈసారి తప్పించుకోలేవు
Advertisement
Ads by CJ

జాతకం పేరుతొ వేరే వాళ్ళ జీవితాల్లోకి వెళ్లి జాతకాలు చెబుతూ వాళ్ళను మానసికంగా బాధపెట్టే వేణు స్వామి ఈమధ్యన కామ్ గా ఉంటున్నాడు అనుకుంటే పొరబాటే. అక్కినేని హీరో నాగ చైతన్య-శోభిత లు నిశ్చితార్ధం చేసుకున్న రోజే పెళ్లి తర్వాత వారు ఓ అమ్మాయి వలన విడిపోతారంటూ జాతకం చెప్పడంతో వేణు స్వామిపై నెటిజెన్స్ తో పాటుగా జర్నలిస్ట్ లు ఫైర్ అయ్యి వేణు స్వామిపై మహిళా కమీషన్ కు కంప్లైంట్ ఇచ్చారు. 

మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చెయ్యగానే వేణు స్వామి హై కోర్టు కు వెళ్లి ఈ వ్యవహారంలో మహిళా కమిషన్ తనను విచారించే అధికారం లేదు అంటూ స్టే తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయం పక్కదారి పట్టించేందుకు కొంతమంది జర్నలిస్ట్ లపై ఆరోపణలు చేస్తూ భార్య శ్రీవాణితో సహా ఆత్మహత్యే శరణ్యమంటూ వీడియో వదిలారు. 

అయితే అప్పుడు మహిళా కమిషన్ విచారణను తప్పించుకున్న వేణు స్వామిని ఈసారి మాత్రం ఒదిలేలా లేరు. ఈరోజు మహిళా కమిషన్ పై ఇచ్చిన స్టే ను హై కోర్టు ఎత్తి వేసింది. వేణు స్వామిని ప్రశ్నించేందుకు మహిళా కమిషన్ కు అన్ని అధికారాలు ఉన్నాయని, వారం రోజుల్లో వేణు స్వామిపై చర్యలు తీసుకోవడానికి మహిళా కమిషన్ ను కోర్టును ఆదేశించింది. దానితో వేణు స్వామి ఈసారి తప్పించుకోలేవు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

High Court Clears Path for Action Against Venu Swamy:

High Court Orders Action Against Venu Swamy

Tags:   VENU SWAMY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ