40 పదుల వయసులోనూ మిలమిల మెరిసిపోయే అందంతో లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగు, తమిళ, హిందీ భాషలను ఏలుతుంది. ఇప్పటికి క్రేజీ స్టార్ హీరోయిన్ గా కనిపిస్తున్న నయనతార కెరీర్ ఆరంభంలో ఉన్న అందం కన్నా పదిరెట్ల అందాన్ని పెంచుకుంది. అందుకే నయనతార అందాన్ని పెంచుకొవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనే టాక్ ఇప్పటికీ వినిపిస్తోంది.
తాజాగా నయనతార ప్లాస్టిక్ సర్జరీ విమర్శలపై స్పందించింది. తనకు తన కనుబొమ్మలంటే చాలా ఇష్టమట. వాటి షేప్ ఎప్పటికప్పుడు మారుస్తుంటాను, దాని కోసం చాలా సమయం వెచ్చిస్తాను, నా కనుబొమ్మల రూపం మారినప్పుడల్లా నా రూపం మారుతూ ఉంటుంది. అందుకేనేమో నా గురించి అలా మాట్లాడుకుంటారు.
వాళ్ళు మాట్లాడుకునేదానిలో నిజం లేదు. డైటింగ్ వల్ల కూడా నా రూపం మారొచ్చు, ఒక్కోసారి బుగ్గలొస్తాయి, ఒక్కోసారి అవి తగ్గిపోతాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చెక్ చేసుకోండి, నా స్కిన్ లో ఎక్కడా ప్లాస్టిక్ కనిపించదు అంటూ నయనతార తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ విమర్శలకు చెక్ పెట్టింది.