దేవర చిత్రం సమయంలో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవడానికి ఓపెన్ గ్రౌండ్ కి వర్షాలు కారణంగా పర్మిషన్ దొరక్క దానిని ఓ హోటల్ లో పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి రావడంతో ఆ ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్ ని క్యాన్సిల్ చేసి మా వల్ల కాదని చేతులెత్తేశారు. దానితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ గా డిజప్పాయింట్ అయ్యారు. ఆ నెక్స్ట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ కు దేవినవరాత్రులు పర్మిషన్ రాకుండా చేసాయి.
ఇప్పుడదే సీన్ పుష్ప 2 కు కూడా రిపీట్ అయ్యేలా ఉంది. పుష్ప ద రూల్ నవంబర్ లో పలు సిటీస్ లో భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. అబ్బ హైదరాబాద్ లోను అల్లు ఫ్యాన్స్ కోసం పుష్ప ద రూల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఓపెన్ గ్రౌండ్ లోనే ప్లాన్ చేస్తారని ఆశపడుతుంటే.. తాజాగా అల్లు ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలేలా ఉంది.
కారణం తెలంగాణాలో ఈరోజు నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్ లో కర్ఫ్యూ పెట్టడంతో ఓపెన్ ఈవెంట్స్ కు ప్రభుత్వం అనుమతులిచ్చే అవకాశం లేకపోవడంతో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణాలో అనుమతి ఇవ్వరని తెలుస్తోంది. మరి తెలంగాణాలో కాకపోతే ఆంధ్రలో అయినా ప్లాన్ చేసుకోవచ్చు. మరి మేకర్స్ ఆలోచన ఎలా అందో.
అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర ఈవెంట్ లేక డిజప్పాయింట్ అయితే ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ కు పుష్ప 2 ఈవెంట్ లేకపోతే వారు కూడా డిజప్పాయింట్ అవడం మాత్రం ఖాయం.