Advertisementt

విశ్వంభర తర్వాత చిరు సినిమా అదే!

Mon 28th Oct 2024 12:39 PM
chiranjeevi  విశ్వంభర తర్వాత చిరు సినిమా అదే!
Megastar yet to take a call on his Next విశ్వంభర తర్వాత చిరు సినిమా అదే!
Advertisement
Ads by CJ

వసిష్ఠ తో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రాన్ని ఆయన  కొడుకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పించారు. మరోపక్క విశ్వంభర షూటింగ్ ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం కూడా సంక్రాంతి నుంచి విశ్వంభర తప్పుకోవడానికి మరో కారణం అంటున్నారు. మెగాస్టార్ చిరు రీసెంట్ గా చికెన్ గున్యా ఫీవర్ బారిన పడి కోలుకోవడానికి సమయం పట్టడంతో షూటింగ్ ఆలస్యమైంది. 

ప్రస్తుతం చిరు రెస్ట్ తీసుకుంటూనే విశ్వంభర ను పూర్తి చేస్తున్నారు. విశ్వంభర తర్వాత మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కుమార్తె సుష్మిత నిర్మాతగా చెయ్యాల్సి ఉన్నా.. దానికి దర్శకుడు సెట్ అవ్వడం లేదు. తాజాగా విశ్వంభర తర్వాత చిరు చెయ్యబోయే ప్రాజెక్ట్ మచ్చ రవి దర్శకత్వంలో ఉండోచ్చనే ఉహాగానాలు రవి నిన్న తిరుమల శ్రీవారి దర్శనానంతరం రివీల్ చేసాడు. 

మచ్చ రవి రాసిన కథ ఇప్పటికే చిరు ఓకె చేసారని తెలుస్తోంది. మరి దర్శకత్వం B.V. N.S రవి చేస్తాడా లేదంటే మరెవరన్నా మచ్చ రవి కథతో చిరు ని డైరెక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.  

Megastar yet to take a call on his Next:

BVS Ravi talks about his next with Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ