Advertisementt

సమంత తో చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన చైతు

Mon 28th Oct 2024 12:07 PM
naga chaitanya  సమంత తో చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన చైతు
Naga Chaitanya erases the last memory with Samantha సమంత తో చివరి జ్ఞాపకాన్ని చెరిపేసిన చైతు
Advertisement
Ads by CJ

కొన్నాళ్లుగా ఎవ్వరికి తెలియకుండా డేటింగ్ చేసిన నాగ చైతన్య-సమంత లు ఆ తర్వాత పెద్దల అంగీకారంతో అంగరంగవైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్ళ దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. అప్పటికే సమంత చైతు ను పెళ్లాడిన ఫొటోస్, అలాగే వెకేషన్స్ లో ఉన్న పిక్స్ అంటే జ్ఞాపకాలను సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ నుంచి తొలగించింది. 

నాగ చైతన్య కూడా సోషల్ మీడియాలో పెద్దగా సమంత తో ఉన్న పిక్స్ పోస్ట్ చెయ్యకపోయినా.. విడాకుల తర్వాత సమంత తో ఉన్న ఫొటోస్ డిలేట్ చేసాడు. అందులో రేస్ కారు ఎక్కుతూ ఇద్దరూ కనిపించిన ఫోటోతో పాటుగా ఆ పోస్ట్ కు బ్యాక్ త్రో.. మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్ అనే క్యాప్షన్ ను కూడా ఇచ్చిన పిక్ ని తొలగించలేదు. ఇప్పడు శోభితతో పెళ్ళికి రెడీ అవుతున్న నాగ చైతన్య ఆ ఫోటోను డిలీట్ చేయకపోవడంపై సమంత ఫ్యాన్స్ అభ్యంతరం పెడుతూ చైతు ను రిక్వెస్ట్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే నాగ చైతన్య సమంత తో ఉన్న ఆ చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసినట్లుగా తెలుస్తోంది. ఇకపై నాగ చైతన్య శోభిత సొంతం కాబట్టి సమంత తో ఉన్న ఆ పిక్ ఉంచడం సరికాదు అనేది నెటిజెన్స్ వాదన. అందుకే చైతు కూడా దానిని తొలగించినట్లుగా తెలుస్తోంది. 

Naga Chaitanya erases the last memory with Samantha:

Naga Chaitanya clears final memory of Samantha ahead of wedding with Sobhita

Tags:   NAGA CHAITANYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ