Advertisement

పుష్ప ద రూల్: పదినిమిషాలకో హైప్

Sun 27th Oct 2024 10:07 PM
anasuya  పుష్ప ద రూల్: పదినిమిషాలకో హైప్
Anasuya about Pushpa The Rule పుష్ప ద రూల్: పదినిమిషాలకో హైప్
Advertisement

పుష్ప ద రూల్ పై మ్యూజిక్ డైరెక్టర్ నుంచి నటీనటులు వరకు ప్రతి ఒక్కరు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా అనసూయ భరద్వాజ్ పుష్ప 2 పై బిగ్ బాస్ సీజన్ 8 దివాళి ఈవెంట్ లో ఇచ్చిన హైప్ మాత్రం అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ స్టేజ్ పై అదిరిపోయే డాన్స్ పెర్ఫర్మెన్స్ ఇచ్చిన అనసూయ ఆ తర్వాత పుష్ప 2 అప్ డేట్ ఇచ్చింది. 

ఏంటమ్మా పుష్ప లో మంగళం శ్రీను ను లేపేస్తా అంటూ బెదిరిస్తున్నావ్.. పుష్ప లో నీ కేరెక్టర్ తో దడిపిస్తున్నావ్ అంటూ అనసూయ ను నాగార్జున ఆటపట్టించారు. ఆ ఫ్లోలోనే అనసూయ పుష్ప ద రూల్ పై పిచ్చ హైప్ క్రియేట్ చేసింది. 

పుష్ప ద రైజ్.. ఇప్పుడు పుష్ప రూల్.. రూల్ చేస్తూనే ఉంటాడు, సినిమాలో ప్రతి పది నిమిషాలకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అది కూడా క్లయిమాక్స్ చూస్తున్నామా అనేంత హైప్ ఉంటుంది. ప్రతి పది నిమిషాలకు అదిరిపోయే సీక్వెన్స్ వస్తుంది అంటూ అనసూయ పుష్ప ద రూల్ పై క్రేజీ అప్ డేట్ ఇచ్చింది. 

Anasuya about Pushpa The Rule:

Bigg Boss Telugu 8: Anasuya about Pushpa The Rule

Tags:   ANASUYA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement