బిగ్ బాస్ లో కొన్ని సీజన్స్ నుంచి ఫెసివల్ ప్రోగ్రామ్స్ కి సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి ఎంటర్టైన్ చెయ్యడం అనేది చూస్తున్నాం. బిగ్ బాస్ మధ్యలో వచ్చే దసరా ఫెస్టివల్ అయినా, దివాళి ఫెస్టివల్స్ అయినా బిగ్ బాస్ యాజమాన్యం స్టార్ మా లో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తుంది. ఈసీజన్ 8 లో ఇప్పటికే దసరా ప్రోగ్రాం ని గ్రాండ్ గా నిర్వహించిన బిగ్ బాస్ యాజమాన్యం రాబోయే దివాళి ని ఇంకాస్త గ్రాండ్ గా ఈ ఆదివారమే నిర్వహించింది.
మరి బిగ్ బిన్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కు జబర్దస్త్ ఆదిని గెస్ట్ గా పిలిస్తే హైపర్ ఆది బిగ్ బాస్ స్టేజిపైకి వచ్చి కంటెస్టెంట్స్ భాగోతాలను సరదా సరదాగా బయటపెడతాడు. మరి ఈ సీజన్ దివాళి ఫెస్టివల్ ప్రోగ్రాం లోను హైపర్ ఆది సందడి మాములుగా లేదు. ఈరోజు ఆదివారం 7 కి మొదలు కాబోయే బిగ్ బాస్ దివాళి ఎపిసోడ్ లో ఆది కంటెస్టెంట్స్ కు పంచ్ లు వేసాడు.
అవినాష్ దగ్గరనుంచి నిఖిల్, యష్మి, పృథ్వీ ఇలా ఏ ఒక్కరిని వదలకుండా హైపర్ పంచ్ లతో ఆది ఆడేసుకున్నాడు. సోనియా, నిఖిల్, పృథ్వీ ప్రేమ దేశం చూపించారంటూ కామెడీ చేసాడు. ఆది వచ్చిన అంతసేపు ఆడియన్స్ నుంచి అరుపులు అన్నట్టుగా హైపర్ ఆది నిజంగా కంటెస్టెంట్స్ తో కామెడీగా ఆడేసుకున్నాడు. మరి ఈరోజు రాబోయే హైపర్ ఆది ఎపిసోడ్ ని చూసి నవ్వుకోవడానికి ఆడియన్స్ రెడీనా.. !