2025 సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ - బాలయ్య NBK 109 పోటీకి దిగడం పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ జనవరి 10 గా ప్రకటించేసారు మేకర్స్. ఇక NBK 109 జనవరి 12 అనుకుంటున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా ఈక్వల్ గా మొదలవడం ఖాయంగా కనబడుతుంది.
అయితే ఆ ప్రమోషన్స్ లో భాగంగా వచ్చే దివాళికి NBK 109 నుంచి క్రేజీ అప్డేట్ రాబోతుంది. NBK 109 టైటిల్ ఇచ్చేందుకు, అలాగే పక్కాగా రిలీజ్ డేట్ ని లాక్ చేసి పోస్టర్ వదలబోతున్నట్లుగా తెలుస్తోంది. అదే దివాళికి కి రామ్ చరణ్-శంకర్ గేమ్ ఛేంజర్ నుంచి మరో ఇంట్రస్టింగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారట.
అది గేమ్ ఛేంజర్ టీజర్ ను దివాళి కి వదలబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి బాక్సాఫీసు వద్దే కాదు ఇలా ఫెస్టివల్ అప్ డేట్స్ లోను పోటీ పడడం పట్ల మెగా గా ఫ్యాన్స్ కి నందమూరి అభిమానులకు క్రేజీ గా మారిపోయింది. సంక్రాంతి విన్నర్ ఎవరైనా ఇలా అప్ డేట్స్ లో పోటీ పడడం మాత్రం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి.