సమంత తో విడాకుల తర్వాత నాగ ఛైతన్య కొన్నాళ్ళు సైలెంట్ గా కనిపించినా చాలాకొద్ది రోజుల్లోనే కోలుకుని హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ప్రేమలో పడ్డాడు. ఇంగ్లాండ్‌లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ క్లూ ఇచ్చిన ఈ జంట ఆ తర్వాత సీక్రెట్ డేటింగ్ చేసారు. ఆగస్టు 8 న చాలా సైలెంట్ గా నిశ్సితార్ధం చేసుకుని అప్పుడు అఫీషియల్ గా మీడియా కు ఫొటోస్ వదిలి సమాచారం అందించారు.
అప్పటి నుంచి నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి ఎప్పుడంటూ అందరూ ముఖ్యంగా అక్కినేని అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. ఈలోపు శోభిత ఇంట పసుపు దంచే ఫొటోస్ బయటికి రావడంతో నాగ చైతన్య తో శోభిత పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసి పెళ్లి పనులను పసుపు దంచడంతో మొదలు పెట్టేసారంటూ అక్కినేని అభిమానులు పండగ చేసుకున్నారు, ఈ వేడుకలో చక్కటి చీర కట్టులో శోభిత మెరిసిపోయింది.
తాజాగా శోభిత హల్దీ వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిలేటివ్స్ తో కలిసి శోభిత డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చెయ్యడంతో అందరూ షాకయ్యారు. కానీ ఆ ఫొటోస్ లో పెళ్లికూతురు గెటప్‌లో శోభితకి బదులుగా మరో యువతి కనిపించింది, ఆమె ఎవరో కాదు శోభిత సిస్టర్ సమంత.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన సమంత .. సాహిల్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం పెళ్లాడింది. అప్పటి హల్దీ వేడుకల ఫొటోస్ ను శోభిత సిస్టర్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.. అది చూసి శోభిత పెళ్లి వేడుకలు మొదలైపోయాయి అని అక్కినేని అభిమానులు పొరపాటుపడ్డారు. అలా శోభిత అక్కినేని అభిమానులను మోసం చేసిందన్నమాట.