కోలీవుడ్ నటుడు జయం రవి తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లుగా అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఆ విషయంలో జయం రవి ప్రస్తుతం కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాడు. భార్యకు విడాకులిస్తూ ఓ సింగర్ తో జయం రవి డేటింగ్ లో ఉన్నాడంటూ రకరకాల ప్రచారాలు వినిపిస్తున్నాయి. మరోపక్క జయం రవితో కోలీవుడ్ నటి ప్రియాంక మోహన్ నిశ్చితార్ధం చేసుకుంది అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
అది ఓ సినిమాకు సంబందించిన పిక్ అని చాలామంది అంటున్నా జయం రవి విడాకులు అనౌన్స్ చేసిన సమయంలోనే ప్రియాంక మోహన్ తో జయం రవి పూల దండలు వేసుకున్న ఫొటోస్ బయటికి రావడంతో చాలామంది అదే నిజమని నమ్మారు. తాజాగా ప్రియాంక మోహన్ జయం రవితో నిశ్సితార్ధం రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.
జయం రవి తో నిశ్చితార్ధం వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని, తామిద్దరం బ్రదర్ సినిమా కోసం కలిసి పనిచేశామని, ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం ఈ ఫొటోను రిలీజ్ చేసినట్టు చెప్పిన ప్రియాంక.. ఆ ఫొటో చూసిన వారు తమకు ఎంగేజ్‌మెంట్ అయ్యిందని అనుకున్నారు.
కానీ తాను షూటింగ్స్‌తో బిజీగా ఉండడం వల్ల ఈ విషయం తన వరకు రాలేదు. ఆ ఫొటో నిజమేననుకుని టాలీవుడ్‌లోని తన స్నేహితులు కూడా కాల్ చేసి అడిగారు. దీంతో ఏం జరుగుతోందో తనకు అర్థం కాలేదని, ఈ ఫొటోను రిలీజ్ చేసిన మూవీ టీంను తిట్టుకున్నానని, అదంతా ఫేక్, సినిమా కోసమే ఆ పిక్ అంటూ ప్రియాంక క్లారిటీ ఇచ్చింది.