లోకేష్ కనగరాజ్ ను స్టార్ డైరెక్టర్ ను చేసిన చిత్రం ఖైదీ, కార్తీ హీరోగా తండ్రి కూతుళ్ళ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ లేదు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అయినప్పటికీ తమిళం నుంచి తెలుగు ప్రేక్షకుల వరకు ఖైదీకి బ్రహ్మరధం పట్టారు. 2019 లో విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. దానితో లోకేష్ కనగరాజ్ స్టార్ దర్శకుడిగా LCU ను ఎనౌన్స్ చేసాడు.
అయితే ఖైదీ విడుదలైనప్పటి నుంచి దానికి సీక్వెల్ గా రాబోయే ఖైదీ 2 పై అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. లోకేష్ ఖైదీ సీక్వెల్ పక్కన పెట్టేసి మాస్టర్, లియో, విక్రమ్, ఇప్పుడు కూలి అంటూ సినిమాలు తీసేస్తున్నాడు, అదిగో ఖైదీ 2, ఇదిగో ఖైదీ 2 అని లోకేష్ కనగరాజ్ అలాగే, కార్తీ చెబుతున్నా ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు.
ఇక ఖైదీ విడుదలై ఐదేళ్లు పూర్తవడంతో లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియా వేదికగా ఖైదీ 2 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. కార్తీ, ఎస్ ఆర్ ప్రభులకు థాంక్స్, వీరి వల్లే లోకేష్ యూనివర్స్ సాధ్యమైంది, ఢిల్లీ వస్తున్నాడు అంటూ ఖైదీ 2 పై లోకేష్ ఇచ్చిన అప్ డేట్ వైరల్ అయ్యింది. దానితో కార్తీ ఫ్యాన్స్ అయితే సంబరాల్లో మునిగిపోయారు.