మెల్లగా టాలీవుడ్, కోలీవుడ్ లో జెండాలు పాతుతున్న మీనాక్షి చౌదరికి తమిళ్ స్టార్ హీరో విజయ్ తో నటించిన GOAT మూవీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక్కడ గుంటూరు కారం చిత్రంలో మీనాక్షిని త్రివిక్రమ్ సెకండ్ హీరోయిన్ పాత్ర ఇచ్చి కూరలో కర్వేపాకు మాదిరి తీసిపడేస్తే.. అక్కడ విజయ్ చిత్రంలో దర్శకుడు వెంకట్ ప్రభు కూడా మీనాక్షి కి అదే మాదిరి అన్యాయం చేసారు.
ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో కలిసి లక్కీ భాస్కర్ తో తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మీనాక్షి ఆ తర్వాత విశ్వక్ సేన్ తో కలిసి మెకానిక్ రాకీ తో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది. అంతేకాదు వరుణ్ తేజ్ మట్కా తో బ్యాక్ టు బ్యాక్ తెలుగు చిత్రాలతో మీనాక్షి టైమ్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తుంది.
తాజాగా మీనాక్షి చౌదరిని కోలీవుడ్ కూడా వదలనంటుంది. శింబు హీరోగా మొదలు కాబోయే ఓ చిత్రంలో మీనాక్షిని హీరోయిన్ గా అనుకుంటున్నారట. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు చెప్పిన కథ నచ్చి మీనాక్షి శింబు చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నలిచ్చింది అంటున్నారు. మరి ఈ చిత్రమైనా మీనాక్షిని కోలీవుడ్ లో నిలబెడుతుందేమో చూడాలి.