బేబమ్మ కృతి శెట్టి చీర కట్టినా హాఫ్ శారీ వేసినా చాలా క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈమధ్యన గ్లామర్ అవతారం ఎత్తిన కృతి శెట్టి అందాలు అందరికి పరిచయం చేస్తూనే కుర్రకారుని కవ్విస్తుంది. మరోపక్క వరస సినిమాలు చేస్తున్నా కృతి శెట్టి ని ఎక్కువగా నిరాశ పరిచే సినిమాలే పలకరిస్తున్నాయి.
టాలీవుడ్ లో వరసగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు పడడంతో అమ్మడు హావ ఇక్కడ తగ్గింది అనే చెప్పాలి. కోలీవుడ్ లో ఇంకా కృతి శెట్టి అదృష్టం పరిచయమవ్వలేదు. అక్కడ కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది కృతి శెట్టి. సినిమా షూటింగ్స్ తో ఎంతగా బిజీగా వున్నప్పటికి అమ్మడు కొన్నాళ్లుగా సోషల్ మీడియాని వదలడం లేదు.
తాజాగా పట్టు చీర లో కృతి శెట్టి ఇచ్చిన ఫోజులకు ఎవ్వరైనా పడిపోవాల్సిందే. ముందు నుంచి ట్రెడిషనల్ గా కనిపిస్తున్న కృతి శెట్టి ఇలా శారీ లో కనిపిస్తే పొగడకుండా ఉండగలరా, అందుకే క్యూట్ కృతి శెట్టి అంటూ అందరూ బేబమ్మ ని ముఖ్త ఖంఠంతో ఎత్తేస్తున్నారు.