Advertisementt

దేవర ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Sat 26th Oct 2024 10:55 AM
devara  దేవర ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
When is Devara OTT streaming.. దేవర ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం దేవర. మొదటిరోజు నెగెటివ్ టాక్ తోనే దుమ్ము దులిపేసింది. నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యాక భారీ కలెక్షన్స్ రావడమనేది నిజంగా అందరికి షాకిచ్చే విషయమే. సౌత్ నుంచి నార్త్ వరకు దేవర హావా చూపించింది. సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో విడుదలైన దేవర చిత్రం ధియేట్రికల్ రన్ చాలా వరకు దగ్గరపడింది. 

దానితో దేవర ఓటీటీ స్ట్రీమింగ్ పై అందరిలో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈమధ్యన హిట్ అయినా, లేదంటే ప్లాప్ అయినా కేవలం నాలుగు వారాల గ్యాప్ లోనే సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కానీ దేవర చిత్రం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ ఒప్పందం మీదే నెట్ ఫ్లిక్స్ కు దేవర డిజిటల్ రైట్స్ అమ్మారు. 

హిందీ సహా తెలుగు అన్ని భాషల్లో దేవర సినిమాను పాపులర్ ఓటీటీ యాప్ నెట్ ఫ్లిక్స్ రికార్డ్ ధర చెల్లించి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 22 లోపు అలా దేవర రెండు సార్లు ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది అనే టాక్ మొదలైంది. దేవర మొదట 7 వారాల థియేటర్స్ రన్ తర్వాత నవంబర్ మిడ్ లో సౌత్ భాషల్లో అందుబాటులో ఉంటుంది

హిందీ ఓటీటీ రిలీజ్ విషయంలో మాత్రం 8 వారాల అగ్రిమెంట్ తర్వాత నవంబర్ 22న అయితే హిందీలో రాబోతుంది అని తెలుస్తోంది. 

When is Devara OTT streaming..:

Devara OTT streaming date locked

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ