Advertisementt

ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీక్

Sat 26th Oct 2024 10:15 AM
ntr  ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీక్
NTR War 2 look leaked ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీక్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర చిత్రం ట్రైలర్ రిలీజ్ అప్ డేట్ అప్పుడు వదిలిన పోస్టర్ ట్రోల్ అయ్యింది. ఎన్టీఆర్ లుంగీ లుక్ నచ్చలేదని చాలామంది మట్లాడారు. కానీ అదే లుక్ దేవర లో థియేటర్స్ స్క్రీన్ మీద చూస్తే అద్భుతం అన్నారు. ఒక సీరియస్ లుక్, ఒక అమాయకపు లుక్ లో దేవర లో ఎన్టీఆర్ కనిపించారు. 

ఇక దేవర ముచ్చట ముగియడంతో ఎన్టీఆర్ వార్ 2 లుక్ లోకి మారిపోయారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ గత వారమే ముంబై ఫ్లైట్ ఎక్కారు. ప్రస్తుతం వార్ 2 లో హృతిక్, ఎన్టీఆర్ లపై ఛేజింగ్ సీన్స్ ని అయాన్ ముఖర్జీ షూట్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ వార్ 2 లుక్ లీకై సెన్సేషన్ సృష్టించింది. 

స్టైలిష్ అండ్ రగ్గుడ్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఇలా లీక్ అయ్యిన ఎన్టీఆర్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాని ఒక్కసారిగా షేక్ చేసాయి. వార్ 2 లో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ ఫేస్ టు పేస్ సీన్స్  గూస్ బంప్స్ తెప్పిస్తాయనే ప్రచారం ఉంది. చెబుతున్నారు. ఇప్పుడు లీక్ అయిన ఎన్టీఆర్ పిక్స్ కూడా అలాంటి సీన్స్ లోనివేనని అంటున్నారు. 

ఏది ఏమైనా దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 లో అంత పవర్ ఫుల్ లుక్ లో కనిపించేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమ్ సంబరాల్లో మునిగిపోయారు. 

NTR War 2 look leaked:

War 2 Leaked Pic: NTR In Action

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ