అవును.. అదేదో అంటారే.. అదేనబ్బా.. ఇద్దరి మధ్యలో దూరి అనవసరం కెలుక్కోవడం అంటారే! హా.. అదీ.. అట్టా ఉంది ఇప్పుడు టీడీపీ పరిస్థితి అని ఇటు జనాల్లో.. అటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంత ప్రత్యర్థులు అయినప్పటికీ వైఎస్ జగన్-వైఎస్ షర్మిల ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా రేపొద్దున్న ఒక్కటవుతారు.. అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అనుకోని పరిణామం ఏదైనా జరగొచ్చు.. దాంతో ఒకటి కావచ్చు కూడా. ఇప్పుడు ఆస్తుల కోసం గొడవ జరుగుతోంది ఓకే.. సమస్య పరిష్కరం అయితే అవుతుంది లేదంటే అయ్యే వరకూ అటు ఇటూ పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇద్దరి మధ్యలోకి టీడీపీ ఎందుకు దూరటం..? బ్లాస్టింగ్, బ్రేకింగ్ హడావుడి చేయడమెందుకు..? దీన్ని క్యాష్ చేసుకోవాలని చూడటమేంటి..? సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరి ఇళ్లలో ఇలాంటి గొడవల్లేవు చెప్పండి. ఇందులో బయటికొచ్చేవి కొన్ని ఉంటే.. రానివి అంతకు వంద రెట్లు ఉంటాయ్..!
అవసరమా..?
ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా ఇద్దరూ రక్తం పంచుకుని పుట్టిన వారే కదా. అన్నకు కష్టం వస్తే చెల్లి, తల్లి.. చెల్లికి కష్టం వస్తే అన్న, వదిన, తల్లి.. తల్లికి కష్టమొస్తే వీళ్లంతా ఉంటారా లేదా..? అలాంటప్పుడు ఇద్దరి మధ్య మరింత అగ్గి రాజేసి ఆనందం పొందడమేంటి..? అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ఇలాంటి ఆస్తి, కుటుంబ సమస్యలు నారా, నందమూరి కుటుంబాల్లో లేవా..? అంటే ఎందుకు ఉండవ్.. కొల్లగా ఉంటాయ్. కానీ లోలోపల పరిష్కారం లేదంటే బయటపడితే పరువు, గౌరవ మర్యాదలు ఇవన్నీ ఆలోచిస్తారా లేదా..! రాజకీయ లబ్ధి కోసమో లేకుంటే మరొకటి ఆశించి చేస్తున్నారో కానీ షర్మిల అయితే రొడ్డెక్కేశారు. సమస్య పరిష్కారం గాక మానదు. పోనీ టీడీపీ అండ్ కో వల్ల అయితే పంచాయితీ పెట్టి పరిష్కారం చేయొచ్చు కదా. కానీ.. షర్మిల కంటే టీడీపీ ఎందుకంత తొందర పడుతోంది..? టీడీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో, మీడియా ముందుకు వచ్చి మరీ మంత్రులు, కూటమి నేతలు హడావుడి చేయడం అవసరమా..? ఎవరైతే వచ్చి హడావుడి చేస్తున్నారో వాళ్లంతా ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఇది మనకు అవసరమా అని ఆలోచించండి.. తర్వాత చూద్దాం..!
ఎవరూ లేరేం..?
ఇటీవల దివంగత నందమూరి తారకరత్న కుమార్తె ఓణీల శుభకార్యం జరిగితే నారా, నందమూరి కుటుంబం నుంచి ఒక్కరూ రాలేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి మరీ కార్యక్రమం నిర్వహించి.. ఆశీర్వదించారు. పోనీ.. కుటుంబ విలువలు, ఆహా, ఓహో అని ఇరగదీసే ఏ ఒక్కరైనా హాజరయ్యారా..? పోనీ హాజరైనట్లు కనీసం ఫొటోలు ఎక్కడైనా దర్శనమిచ్చాయా..? అంటే అబ్బే అస్సలు లేదే. తారకరత్న అసువులు బాసింది నేటి మంత్రి నారా లోకేష్ పాదయాత్రలోనే కదా..? వెళ్లి ఆశీర్వదించి రావొచ్చు కదా.. ఎందుకు వెళ్లలేదు. ఇదేనా తండ్రి, మగ దిక్కులేని ఆ కుటుంబంపై మీరు చూపించే బాధ్యత..? అని సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డి ఫొటోలు షేర్ చేసి మరీ రచ్చ రచ్చ చేస్తోంది వైసీపీ. అందుకే ఎవరి పనుల్లో వారుంటే.. ఎవరికి తోచించి వాళ్లు చేసుకుంటారు కదా.. అరిచి, కొట్టుకోనో లేదంటే తిట్టుకునో అన్నా చెల్లి ఒక్కటవుతారనే విషయాన్ని మరిచిపోతే ఎలా..? పోనీ టీడీపీకి ఒరిగేదేమైనా ఉందా అంటే ఏమీ లేదు కదా..! అందుకే తెలుగు తమ్ముళ్లు హడావుడి, సోషల్ మీడియాలో కాస్త రచ్చ తగ్గించుకుంటే మంచిదేమో అని విమర్శకులు సూచిస్తున్నారు సుమీ!