సౌత్ లో అందులోను టాలీవుడ్ వరస సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్ ఠాకూర్ కి తమిళం నుంచి ఆ హీరో ఆఫర్ వచ్చింది, ఈ హీరో ఆఫర్ ఇచ్చాడని చెప్పుకోవడమే కానీ.. ఇప్పటి వరకు మృణాల్ ఠాకూర్ ఏ తమిళ హీరో తో సినిమా చేసేందుకు సైన్ చేసిన దాఖలాలు లేవు.
అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంగువ లో మృణాల్ కు ఆఫర్ వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది అన్నారు. అది నిజమే మృణాల్ ఠాకూర్ కు సూర్య కంగువ చిత్రంలో ఛాన్స్ వచ్చిందట. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మృణాల్ స్థానంలోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని వచ్చి చేరింది. అయితే అప్పుడు మృణాల్ సూర్య సరసన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నా ఇప్పడు మాత్రం సూర్య సరసన ప్లేస్ కొట్టేసిందట.
కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య చేయబోయే ఫాంటసీ థ్రిల్లర్ లో మృణాల్ ఠాకూర్ నే హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ త్వరలోనే అనౌన్స్ చేయొచ్చు అంటున్నారు. మరి సూర్య లాంటి స్టార్ హీరోతో మృణాల్ ఠాకూర్ తమిళనాట అడుగుపెట్టబోతుంది అనేది ఈ న్యూస్ సారాంశం.