ఇన్నటివరకు మెగాస్టార్ చిరుతో నందమూరి నటసింహ బాలయ్య వార్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు చిరు కొడుకు రామ్ చరణ్ తో బాలయ్య యుద్దానికి సిద్ధం అంటున్నారు. ఈసారి 2025 సంక్రాంతి బాక్సాఫీసు దగ్గర ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సంక్రాంతికి ఎవరెవరు కచ్చిఫ్ లు వేస్తున్నారో నెమ్మది నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు.
అందులో ముందుగా రామ్ చరణ్-శంకర్ గేమ్ ఛేంజర్ జనవరి 10 న ఫిక్స్ చేసారు మేకర్స్. ఇప్పడు నిర్మాత నాగవంశీ కూడా బాలకృష్ణ-బాబీ కాంబో మూవీ NBK 109 ని 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించబోతున్నారు. ముందు నుంచి నందమూరి అభిమానులు ఈ సినిమా విషయంలో ఎన్ని అంచనాలు పెట్టుకొని అయినా థియేటర్ కు రావచ్చని, వాటిని రీచ్ అయ్యే విధంగా కాదు వాటికి మించే ఈ సినిమా ఉంటుంది అని చెబుతూ వస్తున్నాడు.
అదే కాన్ఫిడెన్స్ తో సంక్రాంతి కి గేమ్ ఛేంజర్ తో NBK 109 ని పోటీకి దించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఫైనల్ గా చరణ్ vs బాలయ్య ఈ సంక్రాంతి గెలుపెవరితో.. అంటూ అప్పుడే నందమూరి-మెగా అభిమానులు పందేలు కాసుకుంటున్నారు.