బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ లు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ఇప్పటివి కావు, కొన్నేళ్ళనుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడపుడు అభిషేక్, ఐశ్వర్యాలు ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతున్నా ఈ వార్తలు మాత్రం ఆగడమే లేదు. అత్తగారు జయాబచ్చన్ తన కుమార్తె అంటే ఐష్ ఆడబడుచు ఇంటికొచ్చినప్పటినుంచి ఐశ్వర్య-అభిషేక్ ల మధ్యన విభేదాలు తలెత్తాయని అంటారు.
కానీ ఈమధ్యన ఐశ్వర్యకు ఓ డాక్టర్ తో క్లొజ్ నెస్ ఉంది అందుకే అభిషేక్ ఐశ్వర్య కు విడాకులు ఇవ్వబోతున్నాడని, కాదు కాదు అభిషేక్ బచ్చన్ మరో నటితో డేటింగ్ చేస్తున్నాడు, నమ్రత్ కౌర్‌తో అభిషేక్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడనే విషయం ఇటీవల కాలంలో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. కాబట్టే ఐశ్వర్య-అభిషేక్ లు విడాకులు తీసుకుంటారనే ప్రచారం బాగా చక్కర్లు కొడుతోంది.
అయితే అభిషేక్-ఐష్ లు గ్రే డైవోర్స్ కు సిద్దమవుతున్నారు అనే మాట వినబడుతుంది. అసలు ఈ గ్రే డైవోర్స్ అంటే ఎక్కువ సమయం కాపురం కొనసాగించి.. 50 ఏళ్లకుపై బడిన వారు తమ స్వేచ్ఛా జీవితం కోసం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవడమే గ్రే డైవోర్స్ అంటారు. కొద్దిరోజులుగా ఇది గొప్పింటి కుటుంబాల్లో కనిపిస్తున్నది, ఇప్పుడు ఇదే గ్రే డివోర్స్ కు అభిషేక్-ఐష్ లు రెడీ అవుతున్నారట.