రీసెంట్ గా అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించడం అందరికి తెలిసిందే. పోలీస్ పర్మిషన్ లేకుండా ఆయన నంద్యాల పర్యటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్ప రవి ఇంటికి వెళ్లడంతో అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. పోలీస్ పర్మిషన్ లేకుండా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం పై అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసారు.
దానితో తనపై కేసు కొట్టివేయాలంటూ గత వారం అల్లు అర్జున్ హై కోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఈ కేసులో అల్లు అర్జున్‌కి హైకోర్టులో ఊరటలభించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిన కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో కాస్త ఉపశమనం లభిచింది.
తనపై నమోదు అయిన కేసులను కొట్టివేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. నవంబర్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 6న తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు వెల్లడించింది.