తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ రాజకీయాల్లో కేటీఆర్ ను టార్గెట్ చెయ్యడమే కాదు, అందులో భాగంగా అక్కినేని ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అంతేకాదు అక్కినేని నాగార్జున కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉండగానే.. ఈ కామెంట్స్ పై కేటీఆర్ కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు విచారణలో భాగంగా.. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కోర్టు మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పిన కోర్టు, ఫ్యూచర్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండా సురేఖను కోర్టుఆదేశించింది.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నందున మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి ఆ కామెంట్స్ ను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది...