Advertisementt

పుష్ప2కు పాలిటిక్స్‌తో లింక్ పెట్టొద్దు

Sat 26th Oct 2024 04:04 PM
pushpa 2,allu arjun,politics,producers  పుష్ప2కు పాలిటిక్స్‌తో లింక్ పెట్టొద్దు
Allu Arjun does not belong to any party Says Pushpa 2 Producers పుష్ప2కు పాలిటిక్స్‌తో లింక్ పెట్టొద్దు
Advertisement
Ads by CJ

డిసెంబర్ 6న విడుదల కావాల్సిన పుష్ప 2 ది రూల్ చిత్రం డిసెంబర్ 5నే అంటే ఒక రోజు ముందే విడుదల కాబోతోంది. అందుకు కారణం ఏంటో గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాతలు వివరించారు. అయితే ఈ మీడియా సమావేశంలో నిర్మాతలకు ఇటీవల బాగా వినబడుతోన్న ఓ ప్రశ్న ఎదురైంది. దానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

ఇంతకీ ప్రశ్న ఏమిటంటే.. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్‌పై మెగా ఫ్యామిలీ అంత ఇంట్రస్ట్‌గా లేదు. పుష్ప 1 విడుదలైనప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు రాజకీయాలు అల్లు అర్జున్‌ని ఆ ఫ్యామిలీకి, ఫ్యాన్స్‌కి దూరం చేశాయనేలా టాక్ వినబడుతుంది కదా.. దీనిని మీరెలా చూస్తున్నారనే ప్రశ్నకు నిర్మాతలు నవీన్, రవి శంకర్ సమాధానమిస్తూ.. ఫస్ట్ బన్నీ ఏ పార్టీలో లేడు.. అది అందరూ గమనించాలని కోరారు.

మెగా ఫ్యామిలీ అంతా కలిసే ఉంది. ఎన్నికల సమయంలో చిన్న ఇష్యూస్ వచ్చి ఉండవచ్చు కానీ ఫ్యాన్స్ అందరూ కలిసే ఉన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి.. ఈ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నారు. పాలిటిక్స్ పరంగానూ వాళ్లేం విడిపోలేదు. రాజకీయంగా వాళ్లంతా విడిపోయారని అనడం కరెక్ట్ కాదు. అయినా బన్నీ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పొలిటికల్‌గా ఆయనకు ఎవరితోనూ సంబంధాలు లేవు. దయచేసి ఈ సినిమాకు పాలిటిక్స్‌తో లింక్ పెట్టవద్దని మనవి చేస్తున్నామని మైత్రీ నిర్మాతలు తెలిపారు.

Allu Arjun does not belong to any party Says Pushpa 2 Producers:

Mythri Movie Makers Producers Clarity about Political Issues on Allu Arjun

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ