ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వ్యవహారం బాగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఏదో ఒక జంట, ఏదో ఒక కారణంతో విడిపోతూనే ఉన్నారు. ఇప్పుడా లిస్ట్‌లోకి హీరో జయం రవి కూడా చేరారు. కొన్ని రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లుగా జయం రవి ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తన భార్య మాత్రం తనకు తెలియకుండా విడాకులు ఎలా తీసుకుంటాడు? అంటూ ఓ బాంబ్ పేల్చింది. ఈ గొడవ నడుస్తూనే ఉంది.
తాజాగా జయం రవి మరోసారి ఈ విడాకులపై క్లారిటీ ఇచ్చారు. తన విడాకుల నిర్ణయంపై కామెంట్స్ చేస్తున్న వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ జయం రవి ఏమన్నారంటే.. సెలబ్రిటీ స్టేటస్ అంటే పబ్లిక్‌లో ఉన్నట్లే. మా మంచి చెడులన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మా గురించి వారు డిఫరెంట్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. మా వ్యక్తిగత జీవితాల గురించి కూడా కామెంట్స్ చేస్తుంటారు. అయితే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్లలేను. అలా అనీ నా వ్యక్తిగత విషయాలన్నీ పబ్లిక్‌కి చెప్పలేను.
సమాజం మీద అవగాహన ఉన్నవాళ్లు ఎవరూ కూడా రూమర్స్ వ్యాప్తి చేయాలని అనుకోరు. కానీ కొందరు అదే పనిగా పెట్టుకుని కామెంట్స్ చేస్తుంటారు. మా వ్యక్తిగత రహస్యాలకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తుంటారు. అయితే ఎవరు ఎన్నీ చేసుకున్నా.. నేనేంటో నాకు తెలుసు. అలాంటప్పుడు ఎదుటివారి మాటల్ని తీసుకుని బాధపడతూ కూర్చుండటం నాకు చేతకాదు. ఎందుకు విడాకులు తీసుకుంటున్నాననేది నా పర్సనల్ విషయం. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని జయం రవి చెప్పుకొచ్చారు.