నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో తెలియంది కాదు. నందమూరి అభిమానులు అడిగిన ప్రతిసారి.. ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు దింపుతాం అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. ఇప్పుడా టైమ్ వచ్చేసింది. మోక్షజ్ఞ అరంగేట్రంపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. హనుమాన్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ నందమూరి నట వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. అందుకు సంబంధించిన అప్డేట్‌తో పాటు ఓ పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజా అప్డేట్ ఏమిటంటే..
మోక్షు, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఒక్కసారి సెట్‌పైకి వెళితే.. అస్సలు గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరిపేలా అంతా సెట్ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు, ఈ మూవీని డిసెంబర్ 2న అధికారికంగా ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మూవీ ప్రారంభం అనంతరం వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని టాక్.
ఇక ఇందులో హీరోయిన్‌గా నటించే అమ్మాయి విషయంలో కూడా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట శ్రీలీల అనుకున్నారు.. ఆ తర్వాత రవీనా టాండన్ కుమార్తె రషా తథానీ అనేలా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. బహుశా మూవీ ఓపెనింగ్ రోజు.. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పలు విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇతిహాసాల నేపథ్యంతో సోషియో ఫాంటసీ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనుంది.