Advertisementt

అన్నా చెల్లి లొల్లి.. టీడీపీ బిగ్ రివీల్!

Thu 24th Oct 2024 03:18 PM
ys jagan,sharmila,tdp  అన్నా చెల్లి లొల్లి.. టీడీపీ బిగ్ రివీల్!
TDP Happy with YS Jagan and Sharmila Fight అన్నా చెల్లి లొల్లి.. టీడీపీ బిగ్ రివీల్!
Advertisement
Ads by CJ

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య ఆస్తి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పంపకాలు పూర్తయ్యాయని, మరికొన్నింటిలో రాద్ధాంతం జరుగుతోందని తెలుస్తోంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ను ఆశ్రయించారు. అన్నా చెల్లి మధ్య ఆస్తి లొల్లి నడుస్తుండగా తెలుగుదేశం మాత్రం యమా ఎంజాయ్ చేస్తోంది. అదిగో దుర్మార్గుడు.. ఇదిగో సైకో అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చే చేస్తోంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ రివీల్ అంటూ టీడీపీ, వైసీపీలు బ్రేకింగ్స్‌ను మించి హడావుడి చేస్తున్నాయి. ఒకరోజు ముందే టీడీపీ బిగ్ రివీల్ చేసేసింది.

సైకో అంటూ..

చరిత్రలో ఏ పురాణం చూసినా ఈ ప్రపంచంలో ఏ జీవిని చూసినా తల్లి తరువాతే ఏదైనా. జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఈ కన్నీటి లేఖ చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఒక వింత సైకో గురించి తెలుసుకుంటారు. ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా జగన్ రెడ్డి అనే సైకో ఎలా వేధిస్తున్నాడో..? తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ కన్నీళ్ళతో, సైకో జగన్‌కి లేఖ రాసారు చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ. ఈ లేఖ పై తల్లి విజయమ్మ కూడా సంతకం పెట్టారు. ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే, మన సమాజంలో ఉంటే, ఎంత ప్రమాదమో చెప్పటానికి, ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నాం. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయి. ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుంది.

హ్యాపీ.. హ్యాపీ..

ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీళ్ళతో, ఓ సైకోకి రాసిన, లేఖలోని మొదటి భాగం. మీరు ఇటీవల నాకు పంపిన లేఖపై నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు కుటుంబ వనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ తన నలుగురు మనవళ్లకు సమానంగా పంచాలని నిర్ద్వంద్వంగా ఆదేశించిన విషయం నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆ షరతుకి అంగీకరిస్తున్నానని ఆ సమయంలో మాకు హామీ కూడా ఇచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత మీరు ఆ షరతుకి నేను ఒప్పుకోను అంటూ నిరాకరించారు. భారతి సిమెంట్స్‌, సాక్షి ఇలా తన జీవితకాలంలో రాజశేఖర్ రెడ్డిగారు సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవళ్లు సమానంగా పంచుకోవాలని ఆనాడే నిర్ద్వంద్వంగా చెప్పారు. వీటన్నిటికీ మన అమ్మ సాక్షి మాత్రమే కాదు, మన మధ్య జరిగిన పరస్పర ఒప్పందాలన్నీ గమనించింది కూడా అని వైఎస్ జగన్‌కు షర్మిల రాసిన లేఖను టీడీపీ రివీల్ చేసింది. చూశారుగా.. ఇద్దరు ఆస్తి కోసం కొట్టుకుంటూ ఉంటే టీడీపీ ఎలా ఎంజాయ్ చేస్తోందో..!

TDP Happy with YS Jagan and Sharmila Fight:

TDP Revealed YS Sharmila Letter on YS Jagan

Tags:   YS JAGAN, SHARMILA, TDP
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ