Advertisementt

పుష్పగాడి ఫ్యాన్స్‌కి శుభవార్త

Thu 24th Oct 2024 11:51 AM
pushpa 2 the rule,preponed,allu arjun  పుష్పగాడి ఫ్యాన్స్‌కి శుభవార్త
Pushpa 2: The Rule Preponed by a Day పుష్పగాడి ఫ్యాన్స్‌కి శుభవార్త
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త. ఆయన నటించిన పుష్ప 2 ది రూల్ మూవీ.. ఇప్పటి వరకు చెప్పినట్లుగా డిసెంబర్ 6న కాకుండా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 5నే విడుదల కాబోతోంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా గురువారం ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరో వైపు బిజినెస్ కూడా స్పీడందుకుంది. ఎక్కడికక్కడ రికార్డుల బద్దలయ్యేలా పుష్ప 2 బిజినెస్ జరుగుతోంది.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే చాలా ఇంపార్టెంట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్‌తో నేషనల్ అవార్డ్‌ని సైతం అల్లు అర్జున్ గెలుచుకున్నాడు. అందుకే పుష్ప 2పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను అందుకునేలా, ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఊహించుకున్నదానికంటే ఎక్కువగా పుష్పరాజ్ అలరిస్తాడని మేకర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. వారి కాన్ఫిడెంటే ఇప్పుడు చెప్పిన డేట్ కంటే ఒక రోజు ముందు వచ్చేలా చేస్తుండవచ్చు.

డిసెంబర్ 5న వస్తే దాదాపు 15 రోజుల వరకు మరో మూవీ విడుదల లేదు. అంటే పుష్పరాజ్ గాడి రూల్‌కి అడ్డే లేదు. మరి ఈ 15 రోజులు పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతోందో తెలియాలంటే మాత్రం డిసెంబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Pushpa 2: The Rule Preponed by a Day:

Pushpa The Rule Release Sensation Soon

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ