ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప 2 ది రూల్ మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమాను ఇంటర్వెల్ వరకు లాక్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అంతకు ముందు.. పుష్ప 2 విషయంలో రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అసలీ సినిమా విడుదలవుతుందా? అనే వరకు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అందుకు కారణం ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరే. అయితే రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్‌లో అల్లు అర్జున్ పేరు కూడా చెప్పి.. బన్నీ విషయంలో తనకు ఎటువంటి కోపతాపాలు లేవని క్లారిటీ ఇచ్చేశారు. ఆ మాటతో యూనిట్‌లో కూడా హుషారొచ్చినట్లుగా కనిపిస్తోంది. అప్పటి నుంచి ఈ సినిమా జెడ్ స్పీడ్‌తో రెడీ అవుతోందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హీరోలందరి గురించి పాజిటివ్‌గా చెప్పిన ఒకే ఒక్క మాటతో ఇప్పుడు పుష్ప 2 రూపమే మారిపోయిందనేలా టాక్ వినబడుతుందంటే.. అంతకు ముందు టీమ్‌లో ఎటువంటి అనుమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక విషయంలోకి వస్తే.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల ప్రమోషన్ అనగానే అంతా ముందు బాలీవుడ్, కోలీవుడ్ వంటి చోట్ల ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. కానీ బన్నీ అలా కాదు. పుష్ప2 ది రూల్ ప్రమోషన్స్‌ని హైదరాబాద్‌లో మొదలుపెడుతున్నారు. గురువారం పుష్ప2 ది రూల్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ కూడా ఉంది కాబట్టి.. ఈ సినిమాపై ఉన్న అనుమానాలన్నింటికీ గురువారం తెరపడే అవకాశం ఉందని అల్లు ఆర్మీ భావిస్తోంది. అయితే ఈ వేడుకకు ఐకాన్ స్టార్ వస్తున్నారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. డిసెంబర్ 6న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.