ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారికి మేడమ్ టుస్సాడ్స్ వారు మైనపు విగ్రహాలను ఏర్పాటు చేసి.. వారికి గుర్తింపునిచ్చారు. ఇప్పుడీ లిస్ట్‌లోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరబోతున్నారు. అయితే కాస్త ఆలస్యం అయినప్పటికీ.. వారెవరికీ లేని విధంగా రామ్ చరణ్ ఓ హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. ఈ మైనపు విగ్రహం విషయంలో క్వీన్ ఎలిజిబెత్ 2 తర్వాత స్థానాన్ని రామ్ చరణ్ కైవసం చేసుకున్నారు. అదెలా అనుకుంటున్నారా..
ఇప్పటి వరకు ఈ మైనపు విగ్రహం విషయంలో కేవలం సింగిల్‌గా మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కానీ రామ్ చరణ్ విషయంలో అలా కాదు. తనతో పాటు తనకు ఎంతో ఇష్టమైన పెంపుడు పెట్ రైమ్ కూడా ఈ విగ్రహంలో భాగమైంది. క్వీన్ ఎలిజిబెత్ 2 తర్వాత ఇలా పెంపుడు యానిమల్‌తో విగ్రహం ఏర్పాటు కావడం కేవలం రామ్ చరణ్ విషయంలోనే జరుగుతుంది. అదే ఇప్పుడు ఈ విగ్రహాలున్న హీరోల విషయంలో రామ్ చరణ్‌ని స్పెషల్‌గా చూపెడుతోంది. రామ్ చరణ్, రైమ్‌తో ఉన్న విగ్రహపు నమునాని కూడా మేడమ్ టుస్సాడ్స్ వారు విడుదల చేశారు.
2025 వేసవి నుంచి రైమ్‌తో ఉన్న రామ్ చరణ్ మైనపు విగ్రహం సందర్శన నిమిత్తం అందుబాటులోకి రానుంది. మరో విశేషం ఏమిటంటే.. మేడమ్ టుస్సాడ్స్‌లో ఐఐఎఫ్ఐ జోన్‌లో అమితాబ్, షారుఖ్, కాజోల్, కరణ్‌ల సరసన రామ్ చరణ్ విగ్రహం ఏర్పాటవుతుండటం. ఇక రైమ్‌తో తన మైనపు విగ్రహ ఏర్పాటుపై రామ్ చరణ్ ఏమన్నారంటే.. రైమ్ నా లైఫ్‌లో చాలా ముఖ్యంగా మారిపోయింది. నా వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని అనుసంధానం చేస్తూ.. మేడమ్ టుస్సాడ్స్ వారు విగ్రహం ఏర్పాటు చేయడం నిజంగా నాకెంతో ఆనందాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు.