పవన్ కళ్యాణ్‌తో తమ్ముడు, మహేష్ బాబుతో యువరాజు, వెంకటేష్‌తో ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాలను నిర్మించిన టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకష్ణ అరెస్ట్ అయ్యారు. అయితే ఆ మరుసటి రోజే బెయిల్‌పై ఆయన విడుదలవడం విశేషం. విషయంలోకి వస్తే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని రూ. 10 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కబ్జా చేసేందుకు నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రికార్డ్ అసిస్టెంట్ కె. చంద్రశేఖర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగయ్య పథకం రచించారు.
ఆ పథకాన్ని అమలు చేసే క్రమంలో వారు పోలీసుల చేతికి చిక్కారు. స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి రాయదుర్గం, యాచారం భూముల నకిలీ పత్రాలు చేరినట్టు తెలియడంతో ఆ విభాగం అధికారులు రికార్డ్ అసిస్టెంట్ అయిన కె చంద్రశేఖర్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. దీంతో నకిలీ పత్రాలు అందించిన చంద్రశేఖర్‌తో పాటు మరికొందరిపై ఆగస్ట్‌లో సీసీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. సీసీఎస్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసును ఓయూ ఠాణాకు బదిలీ చేశారు.
ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఓయూ ఠాణా పోలీసులు నిందితులైన నిర్మాత శివరామకృష్ణ, చంద్రశేఖర్, లింగయ్యలను అక్టోబర్ 17న అరెస్ట్ చేసి నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే ఆ మరుసటి రోజే అంటే అక్టోబర్ 18న వారికి బెయిల్ రావడంతో.. వారు ముగ్గురు విడుదలైనట్లుగా తెలుస్తోంది.