Advertisementt

దేవర ఆయుధ పూజ వీడియో సాంగ్

Wed 23rd Oct 2024 11:00 AM
devara,ayudha pooja,video song  దేవర ఆయుధ పూజ వీడియో సాంగ్
Ayudha Pooja Telugu Video Song From Devara Out దేవర ఆయుధ పూజ వీడియో సాంగ్
Advertisement
Ads by CJ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే దేవర సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి.. దాదాపు రూ. 500కి పైగా కోట్లను రాబట్టింది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా ఇంకా అక్కడక్కడా హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతుండటం విశేషం. అయితే ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ వేరు, అక్కడ విడుదల చేస్తున్న పోస్టర్స్‌పై ఉన్న కలెక్షన్స్ వేరు అనేలా.. కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఏదయితేనేం.. మేకర్స్ మాత్రం ఈ సినిమా రూ. 500 కోట్లను బీట్ చేసినట్లుగా అధికారికంగా తెలిపారు. ఇక ఈ సినిమా సాధించిన విజయంపై ఎన్టీఆర్ కూడా తన ఆనందాన్ని ఓ లేఖ ద్వారా తెలియజేశారు. 

ఈ విజయం తనకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో తెలుపుతూ.. ఆ ఆనందానికి కారణమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా తారక్ ధన్యవాదాలు తెలిపారు. ఈ అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు, అభిమానులకు, చిత్ర బృందానికి, మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ తారక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా ఇక ఓటీటీకి వచ్చే సమయం ఆసన్నమైంది. అతి త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. అందుకు సింబాలిక్‌గా మేకర్స్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. 

తాజాగా ఈ మూవీలోని ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ సాంగ్ ఇప్పుడు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇలా వీడియో సాంగ్స్ వదిలారంటే.. అతి త్వరలోనే సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లుగా అర్థం. మరి ఎప్పుడు ఓటీటీకి వస్తుందనేది ఇప్పటికైతే అధికారిక ప్రకటన అయితే లేదు కానీ.. ఈ వీడియో సాంగ్‌తో ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ దేవర చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ భైరాగా, జాన్వీ కపూర్ ఫీమేల్ లీడ్‌గా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌ల మీద కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు.

Ayudha Pooja Telugu Video Song From Devara Out:

Devara Movie Ayudha Pooja Video Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ