Advertisementt

అల్లు-మెగా: అసలు సిసలు కాంపిటీషన్

Tue 22nd Oct 2024 08:32 PM
allu,mega,game changer,pushpa 2  అల్లు-మెగా: అసలు సిసలు కాంపిటీషన్
Competition between Allu and Mega Heroes అల్లు-మెగా: అసలు సిసలు కాంపిటీషన్
Advertisement
Ads by CJ

అల్లు - మెగా ఫ్యాన్స్ మధ్యన కాదు అల్లు-మెగా ఫ్యామిలీస్ మధ్యన డిస్ట్రబెన్సెస్ ఎప్పటికప్పుడు ఎక్స్‌పోజ్ అవుతూనే ఉన్నాయి. అభిమానుల మధ్యన పొరపొచ్చాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మెగా-అల్లు ఫ్యామిలీస్ మధ్యన రచ్చ కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. అయితే ఇపుడు రాబోతున్న అల్లు-మెగా హీరోల సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి.

డిసెంబర్ 6 న అల్లు అర్జున్ నటించిన పుష్ప ద రూల్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పుష్ప‌కు సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రం‌పై విపరీతమైన అంచనాలున్నాయి. పుష్ప 1 తోనే నేషనల్ అవార్డు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప ద రూల్‌తో దున్నేయ్యడం ఖాయమనే ధీమా అల్లు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్.ఆర్.ఆర్‌తో గ్లోబల్ స్టేటస్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ పుష్ప విడుదలైన నెల రోజులకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్.ఆర్.ఆర్ తో ఆస్కార్ లెవల్లో ట్రెండ్ అయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది.. అల్లు-మెగా: అసలు సిసలు కాంపిటీషన్ అని. మరి అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇందులో ఎవరు గెలిచినా, ఓడినా అభిమానులు మాత్రం చొక్కాలు చించేసుకోవడం ఖాయం.

Competition between Allu and Mega Heroes:

Pushpa 2 vs Game Changer

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ