కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో నటించిన సత్యం సుందరం చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే సమయం ఆసన్నమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు రాబోతుండగా.. తాజాగా సదరు ఓటీటీ సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం సత్యం సుందరం సినిమా అక్టోబర్ 27 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
వాస్తవానికి సత్యం సుందరం సినిమా దేవర సినిమా రిలీజైన మరుసటి రోజు థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కార్తి, అరవింద్ స్వామిల నటన, ఎమోషన్స్, హిలేరియస్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవగా.. స్లో నేరేషన్, లాంగ్ రన్ టైమ్ ఈ సినిమాకు మైనస్‌గా మారాయి. అయినా సరే.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కంటతడి పెట్టించే సన్నివేశాలు ఇందులో ఉండటంతో ఓటీటీలోనూ ఈ సినిమా మంచి ఆదరణను పొందుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేసింది. కార్తీ నటనకు మంచి ప్రశంసలు సైతం దక్కడం విశేషం.