పుష్ప పార్ట్ 1 బ్లాక్‌బస్టర్ కావడం, ఆ చిత్రంలో పుష్ప రాజ్ కేరెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప ద రూల్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. డిసెంబర్ 6న పాన్ ఇండియాలో పుష్ప ద రూల్ విడుదల కాబోతుంది.
అల్లు అర్జున్ బర్త్ డేకి వదిలిన స్పెషల్ వీడియో, అలాగే సాంగ్స్ అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పుష్ప ద రూల్ బిజినెస్ ఓ రేంజ్ కాదు కళ్ళు చెదిరే రీతిలో జరిగిపోయినట్లుగా సోషల్ మీడియా టాక్. మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేసినదాని కన్నా బయ్యర్లు అధిక మొత్తం కోట్ చేస్తున్నారట. పుష్ప ద రూల్ కి ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు కలిపి సుమారు 215 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.
నైజాంలో 100 కోట్లు, సీడెడ్ 30 కోట్లకు, వైజాగ్ 23.5 కోట్లకు, ఈస్ట్ 14.5 కోట్లకు, వెస్ట్ 10.8, కృష్ణ 12.5, గుంటూరు 15.5 కోట్లకు, నెల్లూరు 7.5 కోట్లకు పుష్ప 2 థియేట్రికల్ హక్కులు అమ్ముడుపోయినట్లుగా అనధికారిక సమాచారం. మరి పుష్ప 2 ప్రమోషన్స్ మొదలు పెట్టకముందే పుష్ప ద రూల్ బిజినెస్ ఈ రేంజ్‌లో జరగడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి.