బిగ్ బాస్ సీజన్ 8 లో ఎనిమిదో వారం మొదలైంది. ఏడో వారంలో అనారోగ్యం కారణంగా అనుకోకుండా నాగమణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో.. గౌతమ్ బ్రతికిపోయాడు. లేదంటే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా వాడి వేడిగా కాదు రసాభాసగా జరిగింది. ఈ వారం నామినేషన్స్ లో ఓ ఆరుగురు నిలిచారు..
ఎక్కువగా పృథ్వీ, ప్రేరణ, నిఖిల్ ను హౌస్ మేట్స్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, మెహబూబ్, హరితేజ, నయని పావని, విష్ణు ప్రియాలు ఉండగా.. అందులో గౌతమ్ చీఫ్ పవర్ ను ఉపయోగించి హరితేజను సేవ్ చేసినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.
వారి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళతారు, ఈ నామినేషన్స్ రచ్చ ఎలా ఉండబోతుంది అనేది ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్ధమవుతుంది.