నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లి వేడుకలు పసుపు దంచడంతో మొదలైపోయాయి. ఈరోజు సోమవారం మంచి రోజు కావడంతో శోభిత తల్లితండ్రులు సాంప్రదాయం ప్రకారం పసుపు దంచే వేడుకను నిర్వహించారు. శోభిత ఏంతో అందంగా ట్రెడిషనల్ గా చీర కట్టులో పసుకు కొట్టే కార్యక్రమంలో సందడి చేసింది.
మరి అమ్మాయి ఇంట పెళ్లి వేడుకలు మొదలైతే అబ్బాయి నాగ చైతన్య ఇంట కూడా వినాయకుడుకి బియ్యం కట్టడంతో మొదలైపోయి ఉండాలి. అటు పసుపు కొట్టడం, ఇటు వినాయకుడికి బియ్యం కట్టడం మొదలైతే ఇకపై పెళ్లి బట్టలు, శుభలేఖలు అన్న వరసగా చకచకా జరిగిపోతాయి. ఇదంతా ఓకె కానీ నాగ చైతన్య-శోభితాల వెడ్డింగ్ డేట్ ఎప్పడు అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
అయితే నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ల వివాహనికి ఇరు కుటుంబాల వాళ్ళు కలిసి తేదీని నిశ్చయించినట్లుగా టాక్, కరెక్ట్ గా డేట్ తెలియకపోయినా.. డిసెంబర్ మొదటి వారంలో చైతు-శోభితల వివాహం జరిగే అవకాశం ఉంది కనకనే ఇప్పుడు ఇరు కుటుంబాల ఇంట పెళ్లి పనులు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.