ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిటీ సివిల్ కోర్టు షాకిచ్చింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై పవన్ కల్యాణ్ ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పవన్ కళ్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టు సమన్లు జారీ చేసింది.
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వాఖ్యలు ఉన్నాయంటూ.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుమాంసంతో చేసిన నెయ్యిని కలిపారని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ వేశారు. పవన్ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తప్పు అంది.
గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని ఇమ్మనేని రామారావు తన పిటిషన్‌లో కోర్టును కోరగా.. సిటీ సివిల్ కోర్టు పవన్ కల్యాణ్‌కు సమన్లు జారీ చేసింది. అంతేకాదు నవంబర్ 22న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.