సినిమా షూటింగ్స్ చేసుకునేవారికి రాజకీయాలెందుకు, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మీ సినిమాలు మీరు చేసుకోండి.. మీకు రాజకీయాలెందుకు, శుక్రవారమైతే హైదరాబాద్ వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే మీకు రాజకీయాలెందుకు అంటూ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లపై వైసీపీ అధికార ప్రతినిధి రోజా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది.
ఆంధ్రలో ఆడపిల్లలకు, ఆడపిల్లలను కన్న తల్లులకు రక్షణ లేదు, ఎక్కడబడితే అక్కడ అమ్మాయిలను నిర్ధాక్షిణ్యంగా నరికేస్తున్నారు, ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్, బాలకృష్ణలు సినిమా షూటింగ్స్ చేసుకుంటున్నారు, వారిని పరామర్శించడం మానేసి ఎంజాయ్ చేస్తున్నారంటూ రోజా అధికార ప్రతినిధి హోదాలో రెచ్చిపోయింది.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగులు చేసుకునే వారికి రాజకీయాలు ఎందుకు అంటూ రోజా ఫైర్ అవ్వడమే కాదు.. మీరిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, మీ జిల్లాలోనే అత్తాకోడల్ని ఘోరాతిఘోరంగా వేధిస్తే వారిని పరామర్శించడం లేదు, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరికి వారే తమ పనులు తాము చేసుకుంటున్నారు. అసలు విషయం పట్టించుకోవడం లేదు. ఈరోజు సిగ్గులేకుండా ముఖ్యమంత్రి స్తానంలో ఉన్న చంద్రబాబు మట్లాడతాడు అంటూ రోజా చంద్రబాబు పై రెచ్చిపోయింది.