రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉంది. కారణం ఆమె జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో శక్తికి మించి బరువు ఎత్తడంతో ఆమె నడుము భాగం పట్టేసింది. దానితో కొద్దిరోజుల పాటు రకుల్ ను బెస్ట్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సూచించారు. ఇలాంటి సమయంలోనే రకుల్ ప్రీత్ తన భర్త తో కలిసి మొదటి కర్వా చౌత్ జరుపుకుంది.
తన పెళ్లి తర్వాత వచ్చిన మొదటి కర్వా చౌత్ ను రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సాంప్రదాయ దుస్తులలో రకుల్ మరియు జాకీ భగ్నానీ లు ఈ పండుగను సెలెబ్రేట్ చేసుకున్నారు. రెడ్ కలర్ చుడిదార్ లో రకుల్ నడుముకు పట్టి వేసుకుని కనిపించింది.
జల్లెడలో భర్త మొహం చూస్తూ, దీపాలు పెట్టి ఆమె తన ఉపవాస దీక్షను విరమించి శ్రద్దగా పూజ చేసి భర్త ఆశీర్వాదం తీసుకున్న పిక్స్ ని షేర్ చెయ్యగానే అవి ఇట్టె వైరల్ గా మారిపోయాయి.