రెండేళ్లుగా ప్రేమించుకున్న అక్కినేని యువ హీరో నాగ చైతన్య-హీరోయిన్ శోభిత దూళిపాళ్ల పెద్దల అంగీకారంతో ఆగష్టు 8 ఇరు కుటుంబాల నడుమ నిశ్సితార్ధం చేసుకున్నారు. చాలా సింపుల్ గా జరిగిన ఈవేడుకకు కేవలం అక్కినేని-శోభిత కుటుంబాలు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లి విషయంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఇంఫర్మేషన్ లేదు.
చైతు-శోభిత రీసెంట్ గా ఓ లిఫ్ట్ లో దిగిన ఫోటో వైరల్ గా మారింది. నాగ చైతన్య-శోభితల వివాహం ఎప్పుడు ఉంటుందో, పెళ్లి డేట్ ఫిక్స్ చేసి ఎపుడు ప్రకటిస్తారో అని అక్కినేని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా శోభిత దూళిపాళ్ల నివాసమైన వైజాగ్ లో శోభిత-నాగ ఛైతన్య ల పెళ్లి పనులు అఫీషియల్ గా మొదలైపోయాయి.
శోభిత ఇంటి దగ్గర పసుపు కొట్టే కార్యక్రమం మొదలు కావడంతో.. చైతు-శోభిత ల వివాహానికి డేట్ ఫైనల్ అవ్వబట్టే శోభిత ఇంట పసుపు దంచే కార్యక్రమం మొదలైంది, దీనితో ఇరు కుటుంబాల నడుమ పెళ్లి పనులు మొదలైపోతాయి. ఇక పెళ్లి కార్డులు అచ్చు వేయించడం దగ్గర నుంచి పెళ్లి బట్టల షాపింగ్ ఇంకా మిగతా పెళ్లిపనులు మొదలైపోయినట్టే.
పసుపు దంచే కార్యక్రమంలో శోభిత సిగ్గుపడుతూ ట్రెడిషనల్ గా కనిపించింది. చైతు-శోభిత ల పెళ్లి తేదీ ఎపుడు అనేది అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటిస్తుందో.. లేదంటే నిశ్సితార్ధం మాదిరి సైలెంట్ గా పెళ్లి తేదీ దగ్గర కొచ్చాక చెబుతుందో చూడాలి.