Advertisementt

హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్

Mon 21st Oct 2024 02:35 PM
allu arjun  హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్
Allu Arjun approaches AP High Court హైకోర్టుకు వెళ్లిన అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

నేషనల్ స్టార్ అల్లు అర్జున్ హై కోర్టు ను ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. పుష్ప ద రూల్ షూటింగ్ లో బిజీగా వున్న అల్లు అర్జున్ ఇలా హై కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే.. అప్పట్లో అంటే 2024ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన స్నేహితుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే.

నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ ని చూసేందుకు అభిమానులు వేలాదిగా తరలి వచ్చారు. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ అక్కడికి రావడంతో భారీ ఎత్తున పోగుపడిన అభిమానులను కంట్రోల్ చెయ్యడం పోలీసులు వల్ల కాలేదు. అల్లు అర్జున్‌ శిల్పారవి ఇంటికి వచ్చింది వ్యక్తిగతమైనా.. భారీగా ఫ్యాన్స్‌ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

అల్లు అర్జున్ టీమ్ కానీ, శిల్ప రవి తరపు వారు కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్‌తో పాటు శిల్పారవిపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ అల్లు అర్జున్ ఏపీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

Allu Arjun approaches AP High Court:

Allu Arjun Fights Back: High Court Petition Filed!

Tags:   ALLU ARJUN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ