సౌత్ లో అందులోను టాలీవుడ్, తమిళ్ లో క్రేజీ స్టార్ హీరోలతో నటించిన సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో హిందీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పర్సనల్ లైఫ్ లో చాలా సఫర్ అయ్యింది. అటు పర్సనల్ ప్రోబ్లెంస్ ఇటు మాయోసైటిస్ వ్యాధి తో సమంత చాలా రోజులు కోలుకోలేదు. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈమధ్యన ఈ సీరీస్ లో హీరోగా నటించిన వరుణ్ ధావన్ తనని సమంత తో నటించ వద్దని బాలీవుడ్ బిగ్గిస్ నుంచి ప్రెజర్ వచ్చినట్లుగా చెప్పి షాకిచ్చాడు. ఇప్పుడు సిటాడెల్ దర్శకనిర్మాతలైన రాజ్ అండ్ డీకే లు కూడా ఈ సీరీస్ స్క్రిప్ట్ దశలో ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాక హీరోగా వరుణ్ ధావన్ ను ఎంపిక చేశాం. ఈ సీరీస్ లో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలో మొదట అర్థం కాలేదు.
వరుణ్ ధావన్ హిందీ మాట్లాడతాడు కాబట్టి ఇందులో నటించే హీరోయిన్ కూడా హిందీ మాట్లాడే అమ్మాయి అయితే బాగుంటుందనుకున్నాం. ఫ్యామిలీ మ్యాన్-2 సమయంలో సమంత ఎక్కడా హిందీ మాట్లాడలేదు. అందుకే ఈ సీరీస్ కి సమంత ను కాకుండా మరొకరిని తీసుకోవాలని అనుకున్నాం.
కానీ ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి మేం షాకయ్యాం. సమంత స్పష్టంగా హిందీ ఎలా మాట్లాడిందో అర్థం కాలేదు. వెంటనే ఈ సిరీస్ కి సమంత ను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం అని వాళ్ళు చెబితే.. సమంత మాత్రం నాకు హిందీ వచ్చు. కానీ మాట్లాడినప్పుడు ఏమైనా తప్పు మాట్లాడతాను అనే భయంతో నేను ఎక్కువగా హిందీలో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది.