ఈమధ్యన బుట్టబొమ్మ తన 34 వ బర్త్ డే వేడుకల కోసం వెకేషన్స్ అంటూ శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ పూజ హెగ్డే బీచ్ ఒడ్డున ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోస్ ను అలాగే ఫుడ్ తింటూ, బర్త్ డే ను సెలెబ్రేట్ చేసుకుంటూ హొయలు పోతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది.
అయితే శ్రీలంక లో కాస్ట్లీ రిసార్ట్ అయిన వైల్డ్ కాస్ట్ టెంటెడ్ లాడ్జ్ లో బస చేసింది పూజ హెగ్డే. ఆ రిసార్ట్ మొత్తం వెదురు బొంగులతో నేచర్ కి దగ్గరగా నిర్మించినది. దానిలో ఒక రాత్రి బస చెయ్యాలంటే లక్ష నుంచి లక్షన్నర వెచ్చించాలట. మరి సెలబ్రిటీస్ కి అదేమంత పెద్ద అమౌంట్ కాకపోయినా ఆమె అభిమానులకి మాత్రం అది చాలా ఎక్స్ పెన్సివ్. అందుకే అంత వింతగా చెప్పుకుంటున్నారు.
అక్కడ ఆ రిసార్ట్ లో పూజ హెగ్డే బర్త్ డే వేడుకలతో పాటుగా ప్రక్రుతి అందాల నడుమ సేద తీరింది. అసలే ఇప్పుడు అమ్మడు ఒకేసారి రెండు తమిళ స్టార్ సినిమాలతో బిజీ అయ్యింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత పూజ హెగ్డే అందుకున్న సౌత్ ప్రాజెక్ట్స్ రెండు స్టార్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ కావడంతో అమ్మడు లక్కు మళ్ళీ మొదలైనట్టే కనిపిస్తుంది.