ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తో పాటుగా, OG ను కంప్లీట్ చేసే మూడ్ లో ఉన్నారు. అమరావతిలో స్పెషల్ గా వేసిన సెట్ లో హరి హర వీరమల్లు చిత్రీకరణలో పవన్ పాల్గొంటున్నారు. ఇది పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న చిత్రం. ఇక సుజిత్ దర్శకత్వంలో పవన్ OG అనే మాస్ ఎలేవేషన్స్ ఉన్న గ్యాంగ్ స్టర్ మూవీ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ OG మూవీలో కనిపిస్తున్న లుక్స్, ఆయన కేరెక్టర్ అన్ని అభిమానులను విపరీతంగా ఇంప్రెస్స్ చేసాయి. ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు-OG చిత్రాలలో దేనికెక్కువ క్రేజ్ ఉంది అనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. ఏ చిత్రానికి ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో హైప్ ఉంది అంటూ పోల్స్ మొదలు పెట్టారు.
అయితే వీరమల్లు పిరియాడికల్ డ్రామా కావడం, పవన్ కళ్యాణ్ ను మాస్ గా చూడాలని అనుకుంటున్న పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా OG కే ఓటేస్తున్నారు. సుజిత్ పవన్ ను గ్యాంగ్ స్టర్ గా అదిరిపోయే పవర ఫుల్ పాత్రలో చూపించడాన్ని ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు. సో వీరమల్లు, OG లలో OG కే క్రేజెక్కువన్నమాట.